తమిళ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న ధనుష్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో నటించి ఆ మూవీ లలో తన నటన తో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ... ఆ మూవీ లలో ఎక్కువ శాతం మూవీ లతో అద్భుతమైన విజయాలు అందుకున్న ధనుష్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ యువ హీరో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందినటు వంటి సార్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయింది. తమిళ్ లో ఈ సినిమా వాతి అనే పేరుతో విడుదల అయింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ని సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ కి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ... సుమంత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

మూవీ అద్భుతమైన కలెక్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి సూపర్ హిట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లో ధనుష్ తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను మరో సారి ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ధనుష్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ధనుష్ తన తదుపరి మూవీ ని మారి సెల్వరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: