టాలీవుడ్ లో మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తల్లి కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలిసినప్పటి నుంచి మెగా అభిమానులు కాస్త సంబర పడిపోతున్నారు. మెగా ఫ్యామిలీ , అటు
ఉపాసన ఫ్యామిలీలతో పాటు అభిమానులు కూడా ఉపాసనకు పుట్టబోయి బిడ్డ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలా
ఉపాసన డెలివరీ దగ్గర పడుతున్న సమయంలో ఇరువురు కుటుంబ సభ్యులు తరచూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు.ముఖ్యంగా స్నేహితులు బంధువుల ఇంటికి పిలుస్తూ స్పెషల్
పార్టీ ఇస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే తాజాగా మెగా ఫ్యామిలీ తమ కోడలు
ఉపాసన సీమంతం జరిపించడం జరిగింది.
చిరంజీవి నివాసంలో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఈ పార్టీకి
అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా హాజరు కావడం జరిగింది.అంతా కలిసి
ఉపాసన సీమంతం వేడుకలలో చాలా ఎంజాయ్ చేశారని ఈ క్రమంలోని
అల్లు అర్జున్ ఉపాసన గురించి ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.
అల్లు అర్జున్ ఇలా రాసుకోస్తూ "ఉప్పి తాను కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు సో హ్యాపీ ఫర్ మై స్వీట్ టెస్ట్ ఉప్పి అంటూ క్యాప్షన్ రాసుకోరావడం హైలైట్ గా నిలుస్తోంది".
ఉపాసన బేబీ బంపుతో బేబీ
పింక్ కలర్ డ్రెస్సులో కనిపిస్తోంది.అల్లు
అర్జున్ కూడా బ్లాక్ అండ్ బ్లాక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో శ్రీమంతం రోజున దిగిన ఫోటో లాగే కనిపిస్తోంది. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పార్టీలో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇటీవల
రామ్ చరణ్ నాయనమ్మ
చిరంజీవి తల్లి అంజనదేవి కూడా
ఉపాసన కోసం ఒక స్పెషల్ వంటకాన్ని కూడా చేయించింది ఇవన్నీ చూస్తూ ఉంటే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు
ఉపాసన ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు చెప్పాల్సిన పని లేదు.