గత ఏడాది చాలా మంది పెద్ద పెద్ద స్టార్లు కలిసి నటించిన 'పొన్నియన్ సెల్వన్ 1' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.దీనికి  భారీ కలెక్షన్లు వచ్చి సూపర్ హిట్ అయింది. దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండానే దీనికి సీక్వెల్‌గా 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీని చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.తమిళ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపకల్పనలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటులు కలిసి నటించిన 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమాకి మొదటి భాగం కంటే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆరంభంలోనే ఈ సినిమాకి అదిరిపోయే వసూళ్లు దక్కాయి. కానీ, రెండో వారం నుంచి ఈ సినిమాకి కలెక్షన్లు మాత్రం నిరాశజనకంగానే వస్తున్నాయి. అయినా కూడా ఈ మూవీ రెండు వారాల్లోనే ఏకంగా రూ. 300 కోట్లు గ్రాస్ మార్కును దాటింది. అందువల్ల ఈ మార్కును చేరిన అతి తక్కువ చిత్రాల లిస్ట్‌లో చేరింది.


చాలా మంది స్టార్ల కలయికలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ రెండు వారాల్లోనే ఏకంగా రూ. 308.35 కోట్లు గ్రాస్‌ ఇంకా రూ. 148.25 కోట్లు షేర్ వసూలు చేసింది.  ఈ ఏడాది అత్యధిక గ్రాస్‌ను రాబట్టిన తమిళ చిత్రంగా ఈ సినిమా రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే తలపతి విజయ్ నటించిన 'వారిసు' (301.40 కోట్ల రూపాయలు) రికార్డును బ్రేక్ చేసింది.ఇక ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక, అన్ని ఏరియాల్లో కూడా చక్కగా రాణిస్తోన్న ఈ సినిమా తెలుగులో మాత్రం భారీ నష్టాల దిశగా సాగిపోతోంది.ఇదిలా ఉండగా.. చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటుల కలయికలో మణిరత్నం ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ భారీ బడ్జెట్ పిరియాడిక్ సినిమాను శుభాస్కరన్ అల్లిరాజయ్యతో కలిసి మణిరత్నం స్వయంగా నిర్మించారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

PS2