
ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా.. తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. కెరియర్ ప్రారంభంలో మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు ప్రియాంక చోప్రా తెలిపింది. ఇండస్ట్రీలో ఉన్న ఎవరితో కూడా పరిచయాలు లేకపోవడంతో.. ఇక ఎలా ముందుకు సాగుతానో అని భయం వేసింది అంటూ చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. కెరియర్ మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే నాకు ఈ చిత్ర పరిశ్రమలో ఎవరు తెలియదు. దీంతో నా ప్రయాణం ఎలా సాగుతుందో అని చాలా భయపడేదాన్ని.
ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో సీరియస్గా తీసుకునే దాన్ని. మానసికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొన్న. అయితే ఏదైనా సినిమా ఫెయిల్ అయిన లేదా ఏదైనా అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఇక ఎంతగానో బాధపడిపోయేదాన్ని. అయితే నేను సినిమాల్లోకి రాకముందు తెరమీద చూసిన బిగ్గెస్ట్ స్టార్స్ అందరితో కూడా నటించాను. ఇక ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. కాగా ప్రియాంక చోప్రా తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా కి హాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడం మొదలైంది.