గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి ఇక మెగా ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రానున్న చిత్రాలపై అప్టేట్ ఇచ్చారు.

ఆ ముగ్గురు దర్శకులు తమ నెక్ట్స్ చిత్రాల కోసం తమ బ్యానర్ లోనే వర్క్ చేయనున్నట్టు తెలిపారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం చిన్న సినిమాలను కూడా ప్రోత్సహించేందుకు జీఏ2 పిక్చర్స్ బ్యానర్ ను గీతా ఆర్ట్స్ కు అనుబంధంగా స్థాపించి కొత్త టాంటెట్ ను ఎంకరేజ్ చేస్తున్న విషయం తెలిసిందే. GA2 బ్యానర్ లో గతేడాది నుంచి ఏకంగా నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అటు ఇతర భాషల చిత్రాలను కూడా ఇక్కడ విడుదల చేస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలను చేరవేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రెండేండ్ల నుంచి ఎలాంటి సినిమా రావడం లేదు. చివరిగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అలా వైకుంఠపురం’ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయలేదు. ఇక తాజాగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో రానున్న చిత్రాలపై నిర్మాత అల్లు అరవింద్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మలయాళ చిత్రం 2018ను తెలుగు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో అల్లు అరవింద్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాబోయే చిత్రాలపై అప్డేట్ ఇచ్చారు. ‘కార్తీకేయ 2’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు చందూ మొండేటి తన నెక్ట్స్ రెండు సినిమాలను గీతా ఆర్ట్స్ లోనే చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇది ఎప్పుడో పట్టాలెక్కాల్సిందని చెప్పారు. కానీ రెండేళ్ల ఆలస్యం తర్వాత జరగబోతుందని తెలిపారు. మరోవైపు ‘అఖండ’తో బ్లాక్ బాస్టర్ అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా నెక్ట్స్ సినిమాను గీతా ఆర్ట్స్ లోనే చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి రాపో చిత్రంలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ను గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే తెరకెక్కించనున్నట్టు కన్ఫమ్ అయ్యింది. అలాగే దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నారని తెలిపారు. ఇదే బ్యానర్ లో చివరిగా ‘ ధృవ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై త్వరలోనే అప్డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: