
మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టు ఒక్కసారి చుస్తే ముందుగా వినిపించే పేరు ప్రభాస్.. ఈయన ఇప్పటికే 43 ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లి ప్రస్తావన తీసుకు రావడం లేదు.. ఎప్పుడు అడిగిన మాట దాటేస్తున్నాడు. ఈయన ఫ్యాన్స్ ఈయన పెళ్లి కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది అమ్మాయిలు వెయిటింగ్ లో ఉన్న కూడా ప్రభాస్ ఓకే చెప్పడం లేదు.
అలాగే ఈ లిస్టులో రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు.. రామ్ కు 34, విజయ్ కు 33 ఏళ్ళు వచ్చిన పెళ్లి మాట ఎత్తడం లేదు.. అలాగే సందీప్ కిషన్ 35 ఏళ్ళు దాటినా సినిమాలతో బిజీగా ఉన్నాడు కానీ పెళ్లి విషయం చెప్పడం లేదు. ఇక మెగా హీరోలు అయిన సాయి ధరమ్ తేజ్ 36, అల్లు శిరీష్ 35 ఏళ్ళు వచ్చాయి. వీరు కూడా పెళ్లి ఊసు ఎత్తడం లేదు.. బెల్లంకొండ శ్రీనివాస్ 29, అడవి శేష్ 37, నారా రోహిత్ 38 అక్కినేని హీరోల్లో అఖిల్ 28, సుశాంత్ 36 ఏళ్ళు దాటి పోయాయి.. అలాగే లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న తరుణ్ 42 వచ్చిన పెళ్లి చేసుకుంటున్న అనే మాట చెప్పడం లేదు.. మరి వీరిలో ఎవరు 2023లో పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి.