బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ ఫేమ్ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే వంటి క్రేజీ తారాగణంతో దేపా శ్రీకాంత్ రెడ్డి ఆవారా జిందగీ అనే సినిమాను తెరకెక్కించాడు. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి ఈ మూవీని నిర్మించాడు. 100% ఫన్ 0% లాజిక్ మూవీగా ఆవారా జిందగీ వస్తోందని మేకర్లు ఇది వరకే చెప్పేశారు. ఈ సినిమా నేటి శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
శ్రీహాన్, అజయ్, చెర్రీ, జస్వంత్‌లు ఆవారా తిరుగుతుంటారు. ఉద్యోగాలు లేక, రాక పనీ పాట లేక ఖాళీగా తిరుగుతుంటారు. గ్యాంగ్‌ అంతా కలిసి తిరగడం, తాగడం, తినడం అన్నట్టుగా ఉంటుంది వారి వ్యవహారం. అమ్మాయిలను ఏడ్పించడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, దెబ్బలు తినడం వారి పని. సాఫ్ట్ వేర్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్‌కు వెళ్లడంతో కథ మారుతుంది. ఆ తరువాత వారి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? కిడ్నాప్ అయిన అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో చేసిన పనులు ఏంటి? ఎస్సై రెడ్డి (షియాజీ షిండె) ఆ నలుగురు కుర్రాళ్లని ఏం చేశాడు? అసలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ఏది? చివరకు ఏం జరిగింది? అనేది కథ.

నటీనటులు
శ్రీహాన్, అజయ్, చెర్రీ, జస్వంత్‌లు స్నేహితులుగా చక్కగా నటించారు. నలుగురి పాత్రలు బాగా కుదిరాయి. పనీపాట లేని తిరుగుబోతులుగా కనిపించి నవ్వించారు. శ్రీహాన్‌, అజయ్‌లు ఎక్కువగా జనాలను ఎంటర్టైన్ చేస్తారు. ఈ నాలుగు పాత్రలే సినిమాకు కీలకం. నలుగురూ తమ తమ నటనతో సినిమాకు బలంగా నిలిచారు. మిగిలిన పాత్రల్లో ఎస్సైగా షియాజీ షిండే, విలన్‌గా టార్జాన్ మెప్పిస్తారు.

విశ్లేషణ
ఆవారా జిందగీ లాంటి సినిమాలు ఈ మధ్య ఎక్కువగానే వస్తున్నాయి. ఫ్రెండ్స్ గ్యాంగ్, వారు చేసే అల్లరిచిల్లర పనులు, లాజిక్స్ లేకుండా కథను నడిపించడం అనేది ఇప్పుడు ఉన్న ట్రెండ్. జాతి రత్నాలు, మేమ్ ఫేమస్ వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. ఇప్పుడు వచ్చిన ఆవారా జిందగీ సినిమా సైతం అలాంటి ఓ చిన్న ప్రయత్నమే.

అయితే ఈ సినిమాలో అడల్ట్ కామెడీ ఉండటంతో యూత్‌ మరింతగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. అందుకే దర్శకుడు ఈ సినిమాలో కావాల్సినంత మసాలా దట్టించాడు. ప్రథమార్థంలో రొటీన్ సీన్లు కనిపిస్తాయి. నలుగురు ఫ్రెండ్స్ తాగడం, తిరగడం, కుళ్లు జోకులు వేసుకోవడం వంటి సీన్లే పడుతుంటాయి. కానీ ద్వితీయార్థంలో మాత్రం యూత్‌కు కావాల్సిన ఫన్నీ సీన్లు బాగానే వస్తాయి. అవే సినిమాకు కీలకంగా అనిపిస్తాయి.

ఈ నాలుగు పాత్రలో దర్శకుడు బాగానే కామెడీ పండించాడు. అడల్ట్ కామెడీగా వచ్చిన ఈ చిత్రం యూత్‌ను మెప్పించేలా చేయడం దర్శకుడు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. రెండు గంటల కంటే తక్కువ నిడివితో సినిమా ఉండటంతో ఎక్కడా బోర్ అనిపించదు. కెమెరా వర్క్ బాగుంది. డైలాగ్స్ నవ్విస్తాయి. నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి.

రేటింగ్ 2.5

మరింత సమాచారం తెలుసుకోండి: