రవితేజ తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని మొదటిసారి డాన్ శీను సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు.ఆ తర్వాత బలుపు, క్రాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇప్పుడు మళ్లీ గోపీచంద్ తిరిగి రవితేజతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. గోపీచంద్ రవితేజ కాంబినేషన్లో వస్తున్న నాలుగవ సినిమా కావడంతో ఈ సినిమాని..RT -4 GM అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ని కూడా చిత్ర బృందం విడుదల చేశారు పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఒక విలేజ్ గుడిని చూపించడం జరిగింది. అలాగే డేంజర్ అని బోర్డును కూడా ఎస్టాబ్బిల్ చేయడం జరిగింది. చుట్టూ ఫారెస్ట్ ని ఎలిమినేట్ చేసే విధంగా కనిపిస్తోంది. మరి హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ కాంబినేషన్ ఈసారి నాలుగో సినిమాతో కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి