
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు సమాచారం. ఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన సూర్య భార్య జ్యోతిక నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరొకసారి తమిళం మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జ్యోతికా తో పాటు మరొక హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా ఉండబోతుందని సమాచారం.. ప్రస్తుతం ప్రియాంక పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమా షూటింగ్లో నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ మరొకసారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారని ఈ సినిమా కూడా ఒక పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా ఉండబోతుందని సమాచారం.
డైరెక్టర్ వెంకట ప్రభు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి దీంతో విజయ్ ఆభిమానులు ఈ సినిమా పైన కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. గతంలో విజయ్ నటించిన డ్యూయల్ రోల్స్ పొలిటికల్ కథలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు సైతం అభిప్రాయంగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఒక తమిళ హీరో కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు సమాచారం. మరి ఈ విషయం పైన చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి మరి.