ఈపరిస్థితుల మధ్య ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల టైటిల్స్ కూడ మార్చవలసి వస్తుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. కమలహాసన్ శంకర్ ల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా నిర్మిస్తున్న సినిమాకు ‘ఇండియన్ 2’ అన్న టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ను ‘భారతీయన్ 2’ గా మార్చవలసి వస్తుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
అదేవిధంగా నిఖిల్ హీరోగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరొక పాన్ ఇండియా మూవీకి ‘ఇండియా గేట్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈమమూవీని హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈమూవీ టైటిల్ ను కూడ భారత్ గేట్ అన్నట్లుగా మారుస్తారా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు వచ్చేనెల నుండి ప్రారంభంకానున్న వరల్డ్ కప్ క్రికెట్ పోటీలలో పాల్గొనే ఇండియన్ క్రికెట్ టీమ్ ను ఇక రానున్న రోజులలో భారత్ క్రికెట్ టీమ్ గా పిలుస్తారా అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అయితే భారత్ పేరుతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ‘భారత్’ టైటిల్ తో సల్మాన్ ఖాన్ కొన్నేళ్ల క్రితమే ఒక మూవీ చేశాడు. అదేవిధంగా ఒకనాటి హీరో శోభన్ బాబు ‘మిస్టర్ భరత్’ అనే సినిమాలో కూడ నటించాడు. ఇప్పుడు అనుకున్న విధంగా ‘ఇండియా’ పేరు పూర్తిగా ‘భారత్’ గా మారిపోతే భారత్ టైటిల్ తో రానున్న రోజులలో చాలసినిమాలు వచ్చే ఆస్కారం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి