సాయి రాజేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులందరికీ కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా నేటి యూత్ తీరును ఈ సినిమాలో చెప్పకనే చెప్పాడు డైరెక్టర్ సాయి రాజేష్. దీంతో క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సినిమాకు కనెక్ట్ అవ్వడమే కాదు.. ఎంతోమంది ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది ఈ మూవీ.


 అయితే ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కూడా కీలక పాత్రలో నటించాడు అన్న విషయం తెలిసిందే. ఇక తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల ఈ యంగ్ హీరో టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ కారణంగా తాను ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు విరాజ్ అశ్విన్. అదేంటి అల్లు అర్జున్ కారణంగా ఇతను ట్రోల్ ఎదుర్కోవడం అంటే అని అనుకుంటున్నారు కదా. సినిమాల్లోకి రాకముందు తాను డాన్స్ నేర్చుకోవడానికి ఒక డాన్స్ స్కూల్లో చేరాను అంటూ బేబీ సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు విరాజ్ అశ్విన్.


 అయితే అది అల్లు అర్జున్ గారు ప్రాక్టీస్ చేసే షెడ్ అని మా డాన్స్ మాస్టర్ నాతో చెబుతూ.. విరాజ్ ఇక్కడికి అల్లు అర్జున్ గారు వచ్చి ఎంత కష్టపడేవారో తెలుసా. ఉదయం 6:00 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాడు. ఒక్క స్టెప్ సరిగ్గా చేయకపోయినా ఆయన ఇక్కడి నుంచి కదిలేవారు కాదు అంటూ మా డాన్స్ మాస్టర్ చెప్పారని బేబీ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ విరాజ్ అశ్విన్ కామెంట్ చేశాడు. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తున్న సమయంలో విరాజ్ అశ్విన్కి గట్టిగానే బదులిచ్చాడు బన్నీ. మనలో ఏ టాలెంట్ ఉంది ముందు గుర్తించాలి. దానిమీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. అప్పుడు సక్సెస్ అవుతాం. నాకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి దానిపై దృష్టి పెట్ట. నువ్వు ఏం చేయగలవు గుర్తించు అంటూ విరాజ్ అశ్విన్ కు చెప్పాడు. అయితే అల్లు అర్జున్ మాట్లాడిన ఆ ఒక్క మాట నన్ను ట్రోల్స్ ఎదుర్కొనేలా చేసింది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విరాజ్ అశ్విన్.

మరింత సమాచారం తెలుసుకోండి: