
ఇక జయాపజయాల తో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తుంది. గుండెల్లో గోదావరి, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది. కొన్ని చిత్రా ల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసింది.ప్రస్తుతం అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది. అగ్ని నక్షత్రం మూవీ లో మంచు లక్ష్మి లుక్ ఆకట్టుకుంది.అగ్ని నక్షత్రం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. అలాగే మరి కొన్ని చిత్రాలు చేస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. ఇటీవల మంచు లక్ష్మి తన తమ్ముడు మనోజ్ వివాహం దగ్గరుండి చేసింది. మోహన్ బాబు, మంచు విష్ణుకు ఇష్టం లేక పోయినా మనోజ్-మౌనికల వివాహం చేసిందంటూ ప్రచారం జరిగింది.