
దీంతో అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నిన్నటి రోజున నాగచైతన్యతో కూడా తెలుగులో ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలియజేసింది. అల్లు అరవింద్ నిర్మాతగా ఈ చిత్రానికి వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే తమిళ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామీ, శివ కార్తికేయ సాయి పల్లవి సినిమా షూటింగ్ ఓపెనింగ్స్ తో పూలమాలతో తమిళ సాంప్రదాయ పద్ధతిలో సినిమాని మొదలుపెట్టడం జరిగింది.అయితే ఈ ఫోటోలలో కేవలం డైరెక్టర్ సాయి పల్లవి ఫోటోలను క్రాస్ చేసి సాయి పల్లవి వివాహం చేసుకోవాలని విషయాన్ని వైరల్ గా చేయడం జరిగింది.
ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారడంతో సాయి పల్లవి రియాక్ట్ కావాల్సి వచ్చింది.. తన ట్విట్టర్ నుంచి ఇలా షేర్ చేస్తూ నేను రూమర్లను అసలు పట్టించుకోను కానీ కుటుంబ సభ్యులు, స్నేహితులను కలిగి ఉన్నప్పుడు నేను మాట్లాడాలి నా సినిమా పూజ కార్యక్రమం నుంచి ఒక ఫోటోను కావాలని ఎడిట్ చేసి అసహ్యకరమైన ఉద్దేశాలతో కొన్ని ఫేక్ అకౌంట్లను సృష్టించి పబ్లిష్ చేస్తున్నారు.. అభిమానులకు తన సినిమా అప్డేట్ గురించి పంచుకోవాలనుకున్నాను కానీ ఇలాంటి రూమర్స్ పైన స్పందించాల్సి వస్తుందనుకోలేదు అంటూ ఫైర్ అవుతోంది.. ఇది పూర్తిగా నీచమైనది అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి ప్రస్తుతం ట్విట్ వైరల్ గా మారుతోంది.