ఎప్పటినుంచో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న చిత్రం భక్త కన్నప్ప.. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే అధికారికంగా పూజ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించబోతున్నారు. దాదాపుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించబోతున్నట్లు తెలియజేశారు. ఇందులో మంచు విష్ణు భక్త కన్నప్పగా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.


ఇందులో విష్ణుకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ నుపుర్ సనన్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవల ఈ హీరోయిన్ కూడా తప్పుకున్నట్లు విష్ణు నే స్వయంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది.దీంతో ఇప్పటికీ ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా గురించి మరొక అప్డేట్ ని కూడా ఇవ్వడం జరిగింది. కన్నప్ప సినిమాలో సీనియర్ నటి మధుబాల కూడా నటిస్తోందని ఇటీవల మధుబాల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. భక్తకన్నప్ప సినిమా చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారని తెలియజేసింది.


ఇందులో ప్రభాస్, నయనతార మంచు విష్ణు గారితో కలిసి నటిస్తున్ననని కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఈ చిత్రంలో నయనతార ఉందా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో మంచు విష్ణు ఈ సినిమాని చాలా గ్రాండ్ గానే ప్లాన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా మంచు విష్ణు కన్నప్ప చిత్రంలో చాలామంది సౌత్ స్టార్సే ఉంటారని కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు అనుకోకుండా నయనతార పేరు బయటికి రావడంతో ఇందులో ఎంతమంది స్టార్స్ నటిస్తారో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గతంలో ప్రభాస్, నయనతార యోగి చిత్రంలో మాత్రమే నటించారు. దాదాపుగా 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు భక్తకన్నప్ప చిత్రంలో శివుడు పార్వతుల కనిపించబోతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: