ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా స్కంద సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాలో శ్రీకాంత్ , ప్రిన్స్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ ని బోయపాటి శ్రీను ఫ్యామిలీ ప్లేస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ లో యాక్షన్ మరియు ఫ్యామిలీ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఓ ట్రైలర్ ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే మరో ట్రైలర్ ను కూడా ఈ మూవీ బృందం ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ ఫ్యామిలీ అంశాలతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. 

సినిమా యొక్క టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ బిజీ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీనే తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ram