
సంతకం పెట్టిన తర్వాత రాత్రికి వచ్చేయ్ అంటూ అసభ్యంగా అడిగేవారు. ఆ సమయంలో నా దగ్గర ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకపోయినా సరే కాంప్రమైజ్ కి ఒప్పుకునే దానిని కాదు. ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసేదానిని అని కిరణ్ రాథోడ్ తెలిపింది. ఇలా కాంప్రమైజ్ కావడం కంటే ఏదైనా సైడ్ బిజినెస్ చేసుకోవడం బెటర్ అనిపించేది.కానీ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ సమస్య లేదు. మంచి అవకాశాలు వస్తున్నాయి అని కిరణ్ రాథోడ్ పేర్కొంది. అలాగే తాన్ వ్యక్తిగత జీవితం గురించి కూడా కిరణ్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రేమలో తనకి రెండు సార్లు బ్రేకప్ జరిగినట్లు పేర్కొంది.గతంలో ఓ వ్యక్తితో నాలుగేళ్లు సహజీవనం చేశాను. కానీ అతడి సరైన వ్యక్తి కాదని ఆలస్యంగా తెలిసింది. ఇక పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు అతడి అసలు రంగు బయటపడింది. ఒక వేళ అతడిని పెళ్లి చేసుకుని ఉంటే నన్ను ఖచ్చితంగా చంపేసే వాడు అంటూ కిరణ్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆ తర్వాత మరో వ్యక్తిని ప్రేమించా. అతడు కూడా మంచి వాడు కాదు. దీనితో గత ఏడేళ్లుగా సింగిల్ గానే ఉంటున్నా అని కిరణ్ రాథోడ్ పేర్కొంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు అని పేర్కొంది.