హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ ఇప్పటికే ఈ సంవత్సరం పటాన్ , జవాన్ మూవీ లతో వరుసగా 1000 కోట్ల కలెక్షన్ లాంజ్ అందుకొని అద్భుతమైన జోష్ లో ఉన్నాడు. ఇక వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న షారుక్ ప్రస్తుతం డాంకీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ చాలా రోజుల క్రితమే ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మొత్తంగా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందులో మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా రెండవ భాగం షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ విడుదల తేదీని ఈ చిత్ర బృందం వారు వాయిదా వేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దీనితో ఈ మూవీ షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన డాంకీ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడాల్సి వస్తుంది. ఇకపోతే ఓ విషయంలో మాత్రం డాంకీ మూవీక్ని సలార్ సినిమా అవలీలగా దాటేసింది. ప్రస్తుతం బుక్ మై షో ఆప్ లో డాంకీ మూవీ కి 61.6 కే ఇంట్రెస్ట్ లు లభించగా ... సలార్ మూవీ కి ఏకంగా 350 కే ఇంట్రెస్ట్ లు లభించాయి. ఇలా ఈ విషయంలో డాంకీ మూవీ ని సలార్ మూవీ అవలీలగా దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: