మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రియాంక అరుణ్ మోహన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయం సాధించినప్పటికీ ఈ నటికి మాత్రం ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెలుగు సింక్ పరిశ్రమలో లభించింది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ శర్వానంద్ హీరోగా రూపొందిన శ్రీకారం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా తర్వాత ఈ నటి తమిళ ఇండస్ట్రీ పై ఎక్కువగా ఫోకస్ ను పెట్టి అక్కడ పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ప్రియాంక తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ మరో తెలుగు క్రేజీ మూవీ లో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డి వి వి దానయ్యమూవీ ని నిర్మించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమాలో పూజా హెగ్డే ను లేదా ప్రియాంక  లలో ఒకరిని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ  మూవీ బృందం వారు ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: