
ఇక ఇదే కాకుండా రవితేజ, గోపీచంద్ మల్లినేని కాంబినేషన్లో ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి మరొకసారి నటించడానికి సిద్ధమయ్యింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మొదట హీరోయిన్గా శ్రీ లీల అని అనుకోగ కొన్ని కారణాల చేత ఆమె ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో రష్మిక నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరో ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న బైలింగ్వల్ మూవీలో కూడా రష్మిక నటిస్తున్నది.
ఈ క్రేజీ ప్రాజెక్టులతో పాటు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా యానిమల్ అనే సినిమాలో నటిస్తోంది. రష్మిక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే రెయిన్బో అనే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇలా ఒకేసారి ఏడు సినిమాలలో నటిస్తున్న రష్మిక క్రియేషన్ చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మరికొన్ని చిత్రాలలో కూడా రష్మిక నటించే అవకాశం ఉండడంతో ఎవ్వడు తదుపరి చిత్రాలకు డేట్లు అడ్జస్ట్ చేయడం కష్టంగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చాలా సినిమాలకు రష్మిక తిరస్కరించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.