హీరో విజయ్ దేవరకొండ ఇటీవల సమంత కలిసి నటించిన చిత్రం ఖుషి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఇదే ఊపులో మరో రెండు సినిమాలను శరవేగంగా షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక ప్రాజెక్టులో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.


ఇక ఈ సినిమా ప్రకటించిన తర్వాత కేవలం ఈ సినిమాకి VD -12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో శ్రీ లీల విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పైన భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ని స్టార్ట్ చేసుకుని ఒక షెడ్యూల్ పూర్తి చేసిందని తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పు ఉందని ఈమె ప్లేస్ లో రష్మిక అని తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇవ్వడం జరిగింది.


ఇందులో హీరోయిన్గా శ్రీ లీల మాత్రమే నటిస్తోందని ఎలాంటి మార్పులు లేవంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నాగ వంశి చాలా గ్రాండ్ గా నిర్మిస్తూ ఉన్నారు. అలాగే అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ల దిల్ రాజు నిర్మాతగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా ఒక సినిమాలు నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: