బోయపాటి రామ్ కాంబినేషన్ లో విడుదలైన ‘స్కంద’ భయంకరమైన ఫ్లాప్ గా మారినప్పటికీ ఆ రిజల్ట్ ను అంగీకరించకుండా ఆమూవీని ఏదోవిధంగా నిలబెట్టాలని దర్శకుడు బోయపాటి వరసపెట్టి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. వాస్తవానికి గతవారం విడుదలైన మీడియం రేంజ్ సినిమాలు అన్నీ ఫెయిల్ అయినప్పటికీ ‘స్కంద’ మూవీ కలక్షన్స్ ఏమాత్రం పెరగలేదు.



రామ్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈమూవీని తీసి భారీగా ప్రమోట్ చేనప్పటికీ ఈమూవీని మాస్ ప్రేక్షకులు కూడ పట్టించుకొక పోవడం ఆశ్చర్యంగా మారింది. ఈమూవీ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పటికే కష్టాలలో ఉండి రామ్ తో సినిమాను చేస్తున్న పూరీ జగన్నాధ్ మూవీకి కూడ మార్కెట్ పరంగా కష్టాలు ఎదురౌవుతాయా అన్న సందేహాలు కొందరకు వస్తున్నాయి.



ఈ పరిస్థితులు ఇలా ఉంటే ‘స్కంద’ మూవీ ఫ్లాప్ తో బోయపాటి తన భవిష్యత్ సినిమాలకు సంబంధించి డిజైన్ చేసుకున్న యాక్షన్ ప్లాన్ తారుమారు అయ్యే అవకాశం ఉంది అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ తీసిన బోయపాటి అదే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ తో కాని లేదా తమిళ హీరో సూర్య తో కానీ ఒక భారీ బడ్జెట్ తీయాలని ‘స్కంద’ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగానే ప్రయత్నాలు మొదలు పెట్టాడు అని అంటారు.



అయితే అటు బన్నీని కాని ఇటు సూర్య ని కాని సినిమా కథ విషయంలో ఒప్పించడం తలలు పండిన దర్శకుడుకి కూడ చాల కష్టం అని అంటారు. ఇప్పుడు భయంకరమైన ఫ్లాప్ ఇచ్చి బోయపాటి సినిమాలు తీయడం మర్చిపోయాడా అంటూ తన పై సెటైర్లు పడుతున్న పరిస్థితులలో బోయపాటి ఆత్మవిశ్వాసం ఎంతవరకు నిజం అవుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బోయపాటి మాత్రం తన ప్లాన్ కు ఎవరో ఒకరు టాప్ హీరో తనకు దొరికి తీరుతాడు అన్న నమ్మకంలో ఉన్నట్లు టాక్.. .  



మరింత సమాచారం తెలుసుకోండి: