
తాజాగా సీజన్ సెవెన్ లో కాంట్రవర్సీ బ్యూటీగా పేరు దక్కించుకున్న రతిక గ్లామర్ పరంగా మంచి మార్కులే సంపాదించుకుంది. అయితే గేమ్ సరిగా ఆడలేదని బిగ్ బాస్ నుంచి ఆమెను ఎలిమినేట్ చేశారు. గతంలో నారప్ప, కార్తికేయ, దృశ్యం 2 వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ ముద్దుగుమ్మకు దర్శకుడు కే రాఘవేంద్రరావు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టా లో పోస్ట్ చేసింది. వాస్తవానికి దర్శకుడుగా కే రాఘవేంద్రరావు అని ఎప్పుడో అయిపోయింది అదే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే 2017లో చివరిగా ఆయన సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా చేయలేదు. ఇప్పుడు ఆయన ఒక ప్రేమ కథ మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు. అందులోనే రతికాకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రతిక తన ఇంస్టా పేజ్ లో షేర్ చేసుకోగా 11 వేలకు పైగా లైకులు కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా ఈమె అదృష్టం తిరగబోతోంది అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఇది ప్రకటన వరకే పరిమితం అవుతుందా? లేక రిలీజ్ అవుతుందా? అనేది కూడా ఉత్కంఠ భరితంగా మారింది. ఏదిఏమైనా రతిక ఈ సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని సక్సెస్ కావాలని ఆమె అభిమానుల సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ మేరకు రతికా సక్సెస్ అవుతుందో చూడాలి.