ప్రభాస్ జాతకం గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హడావిడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ కు నడుస్తున్న టైమ్ జాతక రీత్యా ఏమాత్రం బాగా లేదని అనేకమంది జ్యోతిష్కులు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ హడావిడి చేస్తున్నారు. దీనికితోడు ‘బాహుబలి 2’ తరువాత ప్రభాస్ నటించిన ‘సాహొ’ ‘రాధేశ్యామ్’ ‘ఆదిపురుష్’ వరసగా ఫెయిల్ అయిన పరిస్థితులలో ప్రభాస్ అభిమానులలో తీవ్ర కలవరపాటు కొనసాగుతోంది.



ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చేనెల విడుదల కాబోతున్న ‘సలార్’ మూవీతో రికార్డులు బద్ధలు అవుతాయని ప్రభాస్ అభిమానులు ధైర్యంగా చెపుతున్నప్పటికీ ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి షాక్ అవుతున్నారు. ఈ మూవీలో ఎటువంటి పాటలు ఉండవని కేవలం తల్లి పై వచ్చే ఒక సాంగ్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా వస్తుందని తెలుస్తున్న వార్తలు ప్రభాస్ అభిమానులలో మరింత నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి అని వార్తలు వస్తున్నాయి.



దీనికితోడు ఈ మూవీ విడుదల అవుతున్న సమయంలోనే షారూఖ్ ఖాన్ ‘ఢుంకీ’ భారీ  హాలీవుడ్ మూవీ ‘ఆక్వామ్యాన్’ విడుదల అవుతూ ఉండటంతో ప్రభాస్ ‘సలార్’ కలక్షన్స్ తగ్గిపోయే ఆస్కారం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ఈమధ్యనే ప్రభాస్ కాలికి సర్జరీ జరగడంతో అతడు తిరిగి ఉత్సాహంగా షూటింగ్ లలో పాల్గొనడానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది అంటున్నారు.



దీనితో తమ హీరో ప్రభాస్ కు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ అతడి అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ‘సలార్’ మూవీని రెండు భాగాలుగా తీయాలని ప్రశాంత్ నీల్ అనుకున్నాడు అని అంటారు. అయితే ‘సలార్’ సెకండ్ పార్ట్ కు ప్రభాస్ అంగీకరించక పోవడంతో ఇప్పుడు ఈ కథను ఒకే సినిమాగా పూర్తి చేయవలసిన పరిస్థితులు వల్ల ఈ మూవీ స్క్రీన్ ప్లే విషయంలో జరిగే పొరపాట్లు ‘సలార్’ కు శాపంగా మారుతాయా అన్న సందేహాలు ఈ మూవీ నిర్మాతలకు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది..  





మరింత సమాచారం తెలుసుకోండి: