యానిమల్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రణ్‍బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న మరియు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అన్‍స్టాపబుల్ షో కు వస్తున్నట్లు కొంతకాలంగా న్యూస్ తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ కూడా ఈ న్యూస్ ని కన్ఫార్మ్ చేసింది. అన్‍స్టాపబుల్ పాన్ ఇండియా ఎపిసోడ్ త్వరలోనే వచ్చేస్తోందంటూ ప్రేక్షకులను ఊరిస్తోంది. తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్‍లో యానిమల్ మూవీ టీమ్ పాల్గొంది.అన్‍స్టాపబుల్ షూటింగ్ కోసం రణ్‍బీర్ కపూర్ నేడే హైదరాబాద్ వచ్చారు. అన్‍స్టాపబుల్ సెట్స్‌కు వెళ్లారు. షూటింగ్‍లో కూడా పాల్గొన్నారు. కాగా, హోస్ట్ బాలకృష్ణతో రణ్‍బీర్ కలిసి దిగిన ఫొటో ఒకటి బయటికి వచ్చింది.. రణ్‍బీర్ కపూర్ బ్రౌన్ చెక్డ్ షర్ట్, లోపల వైట్ టీషర్ట్ ను ధరించారు. అన్‍స్టాపబుల్ హోస్ట్ బాలకృష్ణ బ్లాక్ షర్టుపై బ్లాక్ బ్లేజర్ వేసుకున్నారు.బాలకృష్ణతో రణ్‍బీర్ కపూర్ ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లయన్ మీట్స్ యానిమల్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రణ్ బీర్ నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. అర్జున్ రెడ్డి వంటి బిగ్గెస్ట్ హిట్ అందించిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాకు తెలుగులో కూడా భారీగా క్రేజ్ ఏర్పడింది.తెలుగులో యానిమల్ సినిమాను మరింత ప్రమోట్ చేసేందుకు అన్‍స్టాపబుల్‍కు యానిమల్ టీమ్ వచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి