బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'యానిమల్' కోసం నార్త్ తో పాటు సౌత్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో ప్రమోషన్స్ కూడా అన్ని భాషల్లో చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలో ప్రమోషన్స్ చేసిన మూవీ టీం నుంచి సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ 'యానిమల్' ఇంటర్వెల్ బ్లాక్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. 

ఆయన చెప్పిన దాని ప్రకారం.. 'యానిమల్' ఇంటర్వెల్ బ్లాక్ ఏకధాటిగా 18 నిమిషాల పాటు ఉంటుందట. ఇంత నిడివితో గతంలో మరే సినిమా ఇంటర్వెల్ బ్లాక్ రాలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం రణ్ బీర్ కపూర్ సిక్కుల గెటప్ లో ఉన్న అనుచరులని తీసుకొచ్చి మిషన్ గన్ తో సృష్టించే విధ్వంసం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ట్రైలర్ లో ఇందుకు సంబంధించి కొన్ని షాట్స్ కూడా హైలెట్ అయ్యాయి. తెల్లటి లాల్చీతో దుస్తుల నిండా రక్తం పూసుకొని రణ్ బీర్ చేసే అరాచకం మాటల్లో వర్ణించలేమని అంటున్నారు. నిర్మాత ప్రణయ్ కేవలం ఇంటర్వెల్ బ్లాక్ రన్ టైమ్ గురించి మాత్రమే చెప్పారు. కానీ టీమ్ నుంచి అందుతున్న లీక్స్ అంతకుమించి ఉన్నాయి.

 స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ కంపోజ్ చేసిన ఈ ఇంటర్వెల్ ఫైట్ హాలీవుడ్ స్టాండర్డ్స్ ని ఏమాత్రం తీసుకోకుండా ఉంటుందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ అప్డేట్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 3 గంటల 21 నిమిషాల లాంగ్ రన్ టైం తో డిసెంబర్ 1న ఫ్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: