టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఒకప్పటి అందాల ముద్దుగుమ్మ సోనాలి బింద్రే కాంబినేషన్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా రావాల్సి ఉంది.అయితే అనేక కారణాలవల్ల ఈ క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్ సినీ జనాలు మిస్ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో రావలసిన ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో కాదు నువ్వు నాకు నచ్చావ్‌. వెంకటేష్ హీరోగా, కె. విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా 2001 సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా కొత్త అమ్మాయి ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా విజయంలో ఆర్తి అగర్వాల్ కు సగం క్రెడిట్ ఇవ్వాల్సి ఉంది. వెంకటేష్ పక్కన హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయాలా ? అని తర్జనభర్జనలు జరుగుతున్నప్పుడు ముందుగా సోనాలి బింద్రే పేరు పరిశీలించారు. అప్పటికే ఆమె తెలుగులో మహేష్ బాబు కి జోడిగా మురారి సినిమాలో నటించింది.

సోనాలికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే సురేష్ బాబు ముంబై వెళ్ళినప్పుడు అనూహ్యంగా ఆర్తి అగర్వాల్ ఫోటో చూశారు. ఆయనకు ఎందుకో ఆర్తి బాగా నచ్చేసింది. వెంటనే అమెరికాలో ఉన్న ఆర్తిని ఇండియాకు అడిషన్స్‌కు పిలిపించారు. ఫోటోషూట్ అయిన వెంటనే అర్తి అగర్వాల్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారు. రామానాయుడు స్టూడియోలో తన గెస్ట్ హౌస్ లో ఆమెను ఉంచి మరి నటనలో శిక్షణ ఇప్పించారు. అలా ఆమెకు తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ తొలి సినిమా అయ్యింది.ఆ వెంటనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తరుణ్ హీరోగా వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమాలోనూ ఆమె హీరోయిన్గా నటించారు. ఆ రెండు సినిమాల్లో సూపర్ హిట్ అయ్యాక తెలుగులో అర్తి అగర్వాల్ తెలుగులోనే స్టార్ట్ హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల పాటు ఆమె టాలీవుడ్‌ను ఏకచక్రాధిపత్యంగా ఏలేశారు. అందరి స్టార్ హీరోలతోనూ కలిసిన నటించారు. అయితే ఈ సినిమాలో సోనాలి బింద్రే నటించి ఉంటే వెంకటేష్ - సోనాలి బింద్రే కాంబినేషన్లో

మరింత సమాచారం తెలుసుకోండి: