బాక్స్ ఆఫీస్ వద్ద యానిమల్ సినిమా సృష్టిస్తున్న రికార్డులు మాములుగా లేవు.అసలు ట్రైలర్తోనే ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా  విడుదలైన తర్వాత కూడా అంతకుమించి అనేలా రెస్పాన్స్ అందుకుంటుంది.తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. సౌత్ ఇండియాలో ఇప్పుడు అగ్ర దర్శకుల్లో అతను కూడా ఒకడిగా ఖచ్చితంగా కొనసాగుతాడు అని చెప్పవచ్చు.ఇక ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్ సినిమాలలో యానిమల్ సినిమా కూడా కొత్త రికార్డును క్రియేట్ చేసింది.ఫస్ట్ వీకెండ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో మొదటగా షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో పాటు పఠాన్ సినిమా కూడా టాప్ ప్లేసుల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు యానిమల్ సినిమా అందులో ఒక రికార్డును బ్రేక్ చేయడం విశేషం.ఈ సంవత్సరం షారుక్ ఖాన్ వరుసగా రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు.


తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేసిన జవాన్ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు చాలా మంచి కలెక్షన్స్  వచ్చాయి. ఇక మొదటి వీకెండ్ లోనే ఈ సినిమా ఏకంగా 384 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని టాప్ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇక యానిమల్ సినిమా అయితే 356 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకుని ఈ లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది. అలాగే సందీప్ రెడ్డివంగా కూడా ఈ సినిమాతో ఒక్కసారిగా తన రేంజ్ ని పెంచుకున్నాడు. ఇక వీకెండ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో పఠాన్ సినిమా మొత్తం 313 కోట్లతో మూడవ స్థానంలో నిలిచింది.ఇక జవాన్ పఠాన్ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రణబీర్ కపూర్ యానిమల్ సినిమా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి టోటల్ గా యానిమల్ సినిమా గ్రాస్ కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయో చూడాలి.ఈ సినిమా కెనడాలో సూపర్ గా ఆడుతుంది. USA లో కంటే కెనడాలో ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే కెనడాలో పంజాబీలు ఎక్కువ మంది ఉన్నారు. యానిమల్ సినిమా కూడా పంజాబి నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి నార్త్ ఇండియాలో అలాగే కెనడాలో బాగా ఆడుతుంది. ఇక నార్త్ అమెరికాలో అయితే టాప్ 3 లో జవాన్, పఠాన్, రాజా ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలు ఉన్నాయి.


ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ లో బాగా సక్సెస్ అయిన ఫ్రాంచైజీలో హౌస్ ఫుల్ ఒకటి. ఈ సిరీస్ నుంచి 4 సినిమాలు వచ్చాయి. ఇక 5 వ భాగం 2025 జూన్ 6 న రిలీజ్ కానుంది. ఇక అలాగే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మిమి సినిమాని సౌత్ నటి కీర్తి సురేష్ రీమేక్ చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని కీర్తి సురేష్ తిరస్కరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: