ప్రస్తుతం ఏ చిత్ర పరిశ్రమల్లో కూడా దేశభక్తి సినిమాలు రావడం బాగా తగ్గిపోయాయి.అయితే బాలీవుడ్‌ లో వరుసగా దేశభక్తి సినిమాలు చేస్తున్న విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ సామ్ బహదూర్. డిసెంబర్ 1న థియేటర్ల లో రిలీజైన ఈ సినిమా యానిమల్ తో పోటీ పడుతూ కూడా మంచి వసూళ్లే సాధించింది.ఇక ఇప్పుడీ సినిమా ఓటీటీ లోకి రాబోతోంది. సామ్ బహదూర్ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.విక్కీ కౌశల్ నటించిన వార్ డ్రామా సామ్ బహదూర్ కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే ఉరి, సర్దార్ ఉధమ్ లాంటి దేశభక్తి సినిమాలు చేసిన విక్కీ.. ఇప్పుడు సామ్ బహదూర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. గొప్ప దేశభక్తుడు సామ్ మానిక్‌ షా పాత్ర లో విక్కీ కనిపించాడు. ఈ సినిమా జీ5 ఓటీటీ లో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సామ్ బహదూర్ సినిమా ను మేఘన గుల్జార్ డైరెక్ట్ చేసింది. నిజానికి థియేటర్ల లో రిలీజైన మూడు, నాలుగు వారాల్లోనే ఓటీటీ లోకి వస్తుందన్న వార్తలు మొదట్లో వచ్చినా.. మేకర్స్ మాత్రం జనవరి 26న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా లో మానిక్‌ షా పాత్ర లో విక్కీ కౌశల్ నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి.సామ్ మానిక్‌ షా భారతదేశ తొలి ఫీల్డ్ మార్షల్. 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం లో ఇండియన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. దేశంలో ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ పొందిన తొలి ఆర్మీ అధికారి సామ్ మానిక్‌ షా. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి మానిక్‌ షా ఆర్మీ లోనే ఉన్నారు. ఐదు యుద్ధా ల్లో తన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. 2008లో 94 ఏళ్ల వయసు లో కన్ను మూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: