టాలీవుడ్‌ టాలెంటెడ్ హీరో మ్యాచో స్టార్ గోపీచంద్‌   నుంచి వస్తున్న తాజా ప్రాజెక్ట్‌ భీమా. గోపీచంద్ 31గా తెరకెక్కుతున్న ఈ సినిమాని కన్నడ డైరెక్టర్‌ ఏ హర్ష తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.మార్చి 8న చాలా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో గోపీచంద్‌ టీం ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ ప్లానింగ్‌లో బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. భీమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హన్మకొండ (వరంగల్‌)లోని కాకతీయ గవర్నమెంట్‌ కాలేజ్‌లో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్నట్టు తెలియజేస్తూ గోపీచంద్‌ స్టైలిష్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.మీరు ట్రైలర్‌లో చూసిన దానికంటే ఎక్కువ సినిమాలో చూస్తారట. భీమాలో కామెడీ, వినోదం, యాక్షన్‌, ఫాంటసీ పర్‌ఫెక్ట్‌గా ఉంటాయని, ప్రతీ ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తారని ఇప్పటికే గోపీచంద్ చేసిన కామెంట్స్‌ ఆయన అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తున్నాయి.


మేకర్స్‌ ఇప్పటికే మ్యాచోస్టార్ యాక్షన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. గోపీచంద్ పోలీసాఫీసర్‌గా స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ.. రౌడీలతో సవారి చేస్తున్నట్టుగా ఉన్న లుక్ అయితే సినిమాపై అంచనాలు పెంచుతూ.. సూపర్ బజ్‌ ని క్రియేట్ చేస్తోంది.ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ తెరకెక్కిస్తుండగా.. కేజీఎఫ్‌ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ మూవీతో డైరెక్టర్‌ హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.ఈ సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందట. ఖచ్చితంగా ఈ సినిమా గోపీచంద్ కి మంచి హిట్ ని ఇస్తుందట. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..గత కొంత కాలంగా సరైన హిట్టు కొట్టలేకపోతున్న గోపి చంద్ కి ఈ సినిమా కం బ్యాక్ హిట్ ని ఇస్తుందని ఆశపడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: