ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు రీ రిలీస్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే రీ రిలీజ్ అయిన సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. వాటికి కూడా మంచి కలెక్షన్ లు వస్తున్నాయి. దానితో అనేక మూవీ బృందాలు తమ సినిమాలను కూడా రీ రిలీస్ చేస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా ఈ వారం కూడా మూడు తెలుగు సినిమాలు రీ రిలీస్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.

పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా కాజల్ అగర్వాల్ , అమలా పాల్ హీరోయిన్ లుగా వి వి వినాయక్ దర్శకత్వంలో నాయక్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమాను ఈ వారం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ కొంత కాలం క్రితం తేజ దర్శకత్వంలో రూపొందిన నువ్వు నేను అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అనితమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఈ వారం థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు.

శ్రీనివాస్ హీరో గా రేష్మ రాథోడ్ హీరోయిన్ గా మారుతీ దర్శకత్వంలో ఈ రోజుల్లో అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న ఈ సినిమాను ఈ వారం థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఇలా ఇప్పటికే మొదటి విడుదలలో సూపర్ హిట్ విజయాలను అందుకున్న ఈ మూడు సినిమాలను కూడా ఈ వారం మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: