కొన్ని రోజుల క్రితమే పెద్దగా అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో రూపొందిన మంజుమ్మల్ బాయ్స్ అనే మూవీ మలయాళ భాషలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. 

ఇలా భారీ కలెక్షన్ లను చాలా రోజుల పాటు వసూలు చేస్తూ వచ్చిన ఈ సినిమా ఇప్పటికే మలయాళ సినీ పరిశ్రమలో ఏ మూవీ కలెక్ట్ చేయని స్థాయిలో కలెక్షన్ లను వసూలు చేసే మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ మూవీ మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ నీ తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ తెలుగు వర్షన్ కు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. తాజాగా ఈ మూవీ తెలుగు వర్షన్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ ని మంజుమ్మల్ బాయ్స్ అనే పేరుతోనే తెలుగు లో ఏప్రిల్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మలయాళ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: