ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమాలు చాలా తక్కువగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అయితే కొంతమంది ప్రేక్షకులను నవ్వించేందుకు ప్రయత్నాలు చేసినా అవి ఎందుకో ప్రేక్షకులకు మాత్రం కనెక్ట్ కావడం లేదు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇలా కామెడీ ఓరియంటెడ్ సినిమాలు తీయడం అంటే ఇక డైరెక్టర్లు పెద్ద సాహసం చేయడమే అనే విధంగా నేటి రోజుల్లో పరిస్థితి మారిపోయింది. అయితే ఇలాంటి సాహసాన్ని చేసి సక్సెస్ అవుతున్నారు కొంతమంది డైరెక్టర్లు. మరీ ముఖ్యంగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో సక్సెస్ అయింది. సిద్దు జొన్నలగడ్డ తన వన్ మ్యాన్ షో అదరగొట్టేసాడు. ఈ క్రమంలోనే బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది ఈ మూవీ. అయితే ఇక ఈ కామెడీ ఓరియెంటెడ్ సినిమాకు సీక్వెల్ గా ఇటీవల టిల్లు స్క్వేర్ అనే మరో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇది కూడా సక్సెస్ అయ్యింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇల్లు స్క్వేర్ అనే సినిమాతో కూడా క్రేజీ హిట్ కొట్టేశాడు సిద్దు జొన్నలగడ్డ. దీంతో ఇక ఇప్పుడు టిల్లు క్యూబ్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే చిత్రబృందం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసేసింది అన్న విషయం తెలిసిందే. అయితే టిల్లు క్యూబ్ విషయంలో క్రేజీ కాంబో రిపీట్ కాబోతుందట. మ్యాడ్ మూవీ అనే సినిమాతో కామెడీతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ మూవీ కి దర్శకత్వం వహించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది. అయి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: