సాహో డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ మూవీని వీలైనంత వేగంగా పూర్తి చేసి సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు.ఎలక్షన్స్ కౌంటింగ్ పూర్తయిపోయి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరల పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని సమాచారం వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సాహో సినిమాతో సుజిత్ పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ సినిమా చేశారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తీస్తున్న ఓజీ మూవీ పైన మాత్రం సుజిత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తాజాగా భజే వాయువేగం మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో సుజిత్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓజీ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని తెలిపారు. నిజానికి పవన్ కళ్యాణ్రీమేక్ సినిమా కోసం తనని రమ్మని చెప్పారని, కొత్త కథ ఏదైనా ఉందా అని అడిగారని, అప్పుడు ఓజీ స్టోరీ ఆయనకి నేరేట్ చేశానని అన్నారు. ఇక ఓజీ కథ నచ్చడంతో వెంటనే ఒకే చేశారని డైరెక్టర్ సుజిత్ క్లారిటీ ఇచ్చాడు. ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్, లుక్స్ పరంగా ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులని సుజిత్ బాగా మెప్పించాడు. ఈ సినిమా గ్లింప్స్ పబ్లిక్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. పైగా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో చాలా స్టైలిష్ గా ఉన్నాడనే మాట వినిపిస్తోంది.  ఈ మూవీకి సంబంధించి లో సూపర్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. అందుకోసం పూణే, ముంబై నుంచి పవన్ కళ్యాణ్ కోసం ఫైట్ మాస్టర్స్ రానున్నారు.


ఇదిలా ఉంటే ఈ మూవీ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించాలనేది తన కల అని సుజిత్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగా సుజిత్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ చేస్తే అది అన్ని రికార్డులని బ్రేక్ చేస్తుందని పవర్ స్టార్ అభిమానులు ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అంటున్నారు. రెబల్ స్టార్ ప్రస్తుతం కల్కి సినిమాతో జూన్ 27 న రాబోతున్నాడు. ఈ సినిమా 3D లో కూడా రానుంది.సాహో, ఓజీ మూవీలలో క్యారెక్టర్స్ ని కలుపుతూ మంచి కథని సిద్ధం చేసి సినిమా చేయాలని అటు ప్రభాస్ అభిమానులు ఇటు పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో టాలీవుడ్ నుంచి రాజమౌళి స్థాయిలో సక్సెస్ సత్తా చూపించే దర్శకుల జాబితాలో ఖచ్చితంగా సుజిత్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతని నుంచి ప్రభాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని  విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: