ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వి కపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది . మీరు సినిమాల్లో ఎలాంటి పాత్ర చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారని యాంకర్ అడగగా .. దానికి జాన్వి సమాధానం ఇస్తూ .. " జుట్టు లేకుండా నటించాల్సి వస్తేనే నువ్వు వెంటనే నువ్వు చెబుతా . ఎంత కష్టమైనా పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్న . కానీ జుట్టు లేకుండా నటించలేను . అంతా ఎందుకు ఈ సినిమాలోని పాత్ర కోసం జుట్టు కట్ చేయాలని చెప్పారు .
నేను చాలా గొడవ పడ్డాను . నా మొదటి సినిమా కోసం హెయిర్ కట్ చేశా . అప్పుడు మా అమ్మ బాగా అరిచేసింది . ఎలాంటి రోల్ అయినా చెయ్ .. కానీ జుట్టు కట్ చేసుకోవద్దని చెప్పింది . ఎందుకంటే ఆమెకి నా జుట్టు అంటే చాలా ఇష్టం . అమ్మ మాతో ఉన్నప్పుడు మూడు రోజులకు ఒకసారి ఆయిల్ రాసేది . అమ్మకి ఇష్టం లేని ఈ పని ఎప్పటికీ చేయను " అంటూ తెలిపింది జాన్వి కపూర్ . ప్రెసెంట్ ఈ బ్యూటీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . జాన్వి వ్యాఖ్యలను చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు .