ఎంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి ఎంత వైవిధ్యమైన స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎందుకో బాలీవుడ్ దర్శకుల టేకింగ్ మాత్రం అక్కడ ప్రేక్షకులకు అస్సలు నచ్చడం లేదు. దీంతో భారీ అంచనాల మధ్య వస్తున్న ఎన్నో సినిమాలు చివరికి ఫ్లాప్లుగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఒకప్పటిలా బాలీవుడ్లో సాలిడ్ హిట్లు ఎక్కడ కనిపించడం లేదు. మరి ముఖ్యంగా ఒకప్పుడు వరుస హిట్లతో దూకుడు చూపించిన అక్షయ్ కుమార్.. ఈ మధ్యకాలంలో మాత్రం హిట్ అనే పదానికి బాగా దూరం అయిపోయాడు అని చెప్పాలి. ఇక వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు.
ఈ క్రమంలోనే తన సినిమా ఫ్లాప్ అయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు అక్షయ్ కుమార్. తన సినిమాలు ఫ్లాప్ కావడంపై చాలామంది సానుభూతి మెసేజ్లు పెడుతున్నారు అంటూ తెలిపాడు. ఇక ఇలా సానుభూతి చూపించడం పై అసహనం వ్యక్తం చేశాడు. నేను ఎక్కువ ఆలోచించను. ఏది జరిగిన కూడా స్వాగతిస్తాను. సినిమా ఫ్లాప్ అవ్వగానే సారి డోంట్ వర్రీ అంటూ ఎంతో మంది సానుభూతి మెసేజ్లు పెడుతున్నారు. నేను చనిపోలేదు బతికే ఉన్నాను. సినిమా ఫలితం ఏదైనానేను పని చేస్తూనే ఉంటాను అంటూ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అయితే అక్షయ్ కుమార్ వ్యాఖ్యలపై సినీ ప్రేక్షకులు కొంతమంది మండిపోతున్నారు. సినిమా ఫ్లాప్ అయితే మీకేమి అనిపించదు. కానీ నిర్మాతలు మాత్రం కోట్లల్లో నష్టపోవాల్సి ఉంటుంది. మీకు రావాల్సిన రెమ్యూనరేషన్ మీకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఇలా మాట్లాడకుండా ఇంకేం చేస్తారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిర్మాతల కష్టాలను అర్థం చేసుకున్న వారే ఇలా సానుభూతితో మెసేజ్లు పెడుతూ ఉంటారు అది అర్థం చేసుకోకుండా అక్షయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.