తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన ను క్రియేట్ చేసుకున్న దర్శకులలో కృష్ణ వంశీ ఒకరు . ఈయన ఎక్కువ శాతం తన కెరియర్ లో కమర్షియల్ సినిమాల వైపు వెళ్లకుండా వైవిధ్యమైన సినిమాలతోనే అద్భుతమైన విజయాలను అందుకున్నాడు . దానితో ఈయనకు క్రియేటివ్ దర్శకుడు అనే పేరు కూడా వచ్చింది. కృష్ణవంశీ ఆఖరుగా రంగ మార్తాండ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు . మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది.

ఈ మధ్య కాలంలో కృష్ణ వంశీ ఎక్కువ శాతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ అనేక విషయాలను పంచుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక కృష్ణ వంశీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో అనేక మంది అభిమానులు ఆయన సినిమాలకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలను అడుగుతున్నారు. ఆయన కూడా అంతే పాజిటివ్ గా వారు అడిగిన సమాధానాలకు జవాబులు ఇస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఓ నెటిజన్ కృష్ణ వంశీ ని మీరు ఖడ్గం సినిమాకు దర్శకత్వం వహించారు.

సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఆ సినిమాలో శ్రీకాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఆ పాత్ర ద్వారా శ్రీకాంత్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇక మొదట శ్రీకాంత్ నే ఆ పాత్రకు అనుకున్నారా ..? లేక వేరే ఏ నటుడునైనా అనుకున్నారా అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు కృష్ణ వంశీ స్పందిస్తూ ... ఆ పాత్రకు మొదటి నుండి శ్రీకాంత్ నే అనుకున్నాను. ఆయననే సంప్రదించాం. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆయనతోనే ఆ సినిమాలోని ఆ పాత్రను చేయించాం అని కృష్ణ వంశీ తాజాగా సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: