
తాజాగా మహేష్ బాబు సంక్రాంతి పండగ సందర్భంగా అందరితో గెట్ టు గెదర్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు . ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇదే మూమెంట్లో ఎస్ఎసెంబీ 29 గురించి టాప్ సీక్రేట్ రివీల్ చేశారట మహేష్ బాబు . రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మహేష్ బాబు నటించబోయే సినిమా మార్చి రెండవ వారంలో సెట్స్ పైకి రాబోతుందట . అది కూడా మొదటి సినిమా సీన్ ని హైదరాబాద్ లోనే చిత్రీకరించబోతున్నారట .
దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ న్యూస్ విని సంబరపడిపోతున్నారు. ఇప్పుడు అన్న నిజమైన పండుగ స్టార్ట్ అంటూ మహేష్ బాబు అభిమానులు పందగ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీసం మెలివేయండి రా ఫ్యాన్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇన్నాళ్లు పాన్ ఇండియా స్టేటస్ లేదు అంటూ మహేష్ బాబుని ఏడిపించారు . పాన్ ఇండియా ఇండియా కాదు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు కూసింత గట్టిగానే హిట్ కొట్టాలని డిసైడ్ అయిన్నట్లు ఉన్నాడు. . రాజమౌళి చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ తన లెవెల్ ని మార్చేసుకుంటున్నాడు ...!