ప్రభాస్ సినిమా షూటింగ్ లొ పాల్గొంటే షూటింగ్ కు హాజరైన అందరికీ ప్రత్యేక భోజనం అందేలా చూస్తారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ భోజనం గురించి ఇప్పటికే పలువురు హీరోయిన్లు ప్రశంసలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం చాలా సందర్భాల్లో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
ప్రభాస్ ఇంటి భోజనానికి బాలీవుడ్ స్టార్స్ సైతం ఫిదా అయిన సందర్భాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఇంటి నుంచి ఇమాన్వికి క్యారేజ్ వెళ్లగా ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఇందుకు సంబంధించిన ఫోటోలను పంచుకోవడం జరిగింది. ప్రభాస్ కు థ్యాంక్స్ చెబుతూ ఆమె ఈ ఫోటోలను పెంచుకున్నారు. ఢిల్లీ బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ ఫౌజీ సినిమాలో తన నటనతో ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.
ఇమాన్వి ఇస్మాయిల్ కు తెలుగులో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయని అయితే సినిమాల ఎంపికలో ఆమె ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇమాన్వి ఇస్మాయిల్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి. ప్రభాస్ సినిమాకు ఇమాన్వి కోటి రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. స్టార్ హీరో ప్రభాస్ ఇమాన్వి ఇస్మాయిల్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి