సినిమా ఇండస్ట్రీ లో హీరోలు నిర్మాతలుగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొంత మంది స్టార్ హీరోలు తమ టెస్ట్ కు నచ్చిన సినిమాలను నిర్మించడానికి ఓ బ్యానర్ ను స్థాపించి అందులో చిన్న సినిమాలను , తమ టెస్టుకు నచ్చిన సినిమాలను నిర్మిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ యంగ్ హీరో కూడా ఓ నిర్మాణ సంస్థను స్థాపించినట్లు , అందులో ఓ చిన్న సినిమాను నిర్మిస్తున్నట్లు తాజాగా ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇంతకు ఆ హీరో ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో హీరోగా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. తాజాగా ఈయన దిల్రుబా అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. తాజాగా ఈ నటుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయనకు మీరు ఓ నిర్మాణ సంస్థ స్థాపించినట్లు , అందులో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ... నిజమేనా అనే ప్రశ్న ఎదురయింది. దానికి కిరణ్ సమాధానం ఇస్తూ ... అవును ... నిజమే. చాలా కాలం నుండి ఓ కథపై పని చేశాను. ఆ కథ అద్భుతంగా నచ్చడంతో నేనే సొంతగా ఆ సినిమాను నిర్మిస్తున్నాను. ఆ మూవీ చాలా బాగా వస్తుంది. మరికొంత కాలం లోనే ఆ మూవీ షూటింగ్ కూడా పూర్తి కాబోతోంది. ఆ మూవీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంది అని కిరణ్ అబ్బవరం తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: