
రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది స్టార్స్ ఐటెం సాంగ్స్ చేయడానికి ఇష్టపడరు . కానీ ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఐటెం సాంగ్స్ లో నటించడానికి చిందులు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా నయనతార తన కెరీర్ లో ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ నటించాలి . కానీ మిస్ చేసుకున్నింది. ఆ సాంగ్ మరేంటో కాదు స్టాలిన్ . యస్ స్టాలిన్ మూవీలో నయనతార స్పెషల్ సాంగ్ లో మెరవాలి అంటూ మేకర్స్ అనుకున్నారట. ఆ మూవీలోని స్పెషల్ సాంగ్ బాగా హైలెట్ అయ్యింది.
చిరంజీవి హీరోగా కుష్బూ ప్రధాన పాత్రలో త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో స్పెషల్ పాటలో మెరుస్తుంది హీరోయిన్ అనుష్క. నిజానికి ఈ పాటలో ముందుగా హీరోయిన్ గా నయనతారను అనుకున్నారట. అప్పుడప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్న మూమెంట్లో నయనతార ఇలా స్పెషల్ సాంగ్ లో కనిపిస్తే ఆమె కెరియర్ దెబ్బతింటుంది అన్న భయంతో నయనతార ఈ పాట ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత చిరంజీవితో హీరోయిన్గా నటించింది నయనతార. వీళ్ళ కాంబో మంచి హిట్ సినిమాలు కూడా పడ్డాయి. ప్రజెంట్ నయనతారకి అవకాశాలు తగ్గిపోయాయి . అది ఆమె తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగానే అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు..!