
తన 13 ఏళ్ల కల నెరవేరిందని..అవును మీరు అనుకున్నదే ఎంగేజ్మెంట్ అన్నట్లుగా వినిపిస్తూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఇందులో తన ప్రియుడు మోకాలు పైన కూర్చొని అంజనకు ప్రపోజ్ చేస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు కనిపిస్తూ ఉండగా మరికొన్ని ఫోటోలు అంజన కాబోయే భర్త తనని ఎత్తుకొని ఉన్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అలాగే అర్జున్ సర్జా దంపతులతో పాటుగా ఐశ్వర్య దంపతులు కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నారు. మరొక ఫోటోలు గ్రూప్ ఫోటోలు అందరూ దిగినట్టుగా కనిపిస్తుంది.
అంజన సర్జా వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలోనే చాలా గ్రాండ్గా జరుపుకోబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అర్జున్ డైరెక్టర్ గా కూడా పది సినిమాలకు పైగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అర్జున్ 1988లో ప్రముఖ నటి నివేదాన ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా పలు చిత్రాలలో నటించినప్పటికీ ఎందుకో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేదు. అయితే గత ఏడాది ఈమె ఉమాపతి రామయ్యను ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. ఇక అర్జున్ సర్జరీ చిన్న కూతురు అంజన కూడా వరల్డ్ కంపెనీని స్థాపించి అందుకు సీఈఓ కూడా వ్యవహరిస్తున్నది.