బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటన అందచందాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా వారి కెరీర్ కొనసాగిస్తారు. అలాంటి వారిలో నటి ఊర్వశి రౌతేలా ఒకరు. ఈ చిన్నది బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. ఇక తెలుగులోను అనేక సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులోనూ ఈ చిన్న దానికి విపరీతంగా అభిమానులు అయ్యారు. ఇక ఊర్వశి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.



తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అందులో బద్రీనాథ్ దగ్గరలో తన ఆలయం ఉందని అక్కడ ప్రతి ఒక్కరు తన ఆశీర్వాదం తీసుకుంటారని వెల్లడించింది. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు తనకు మాలలు వేసి ఆరాధిస్తారంటూ ఊర్వశి అన్నారు. పనిలో పనిగా దక్షిణాదిన కూడా తనకు ఆలయం కడితే బాగుంటుందని ఊర్వశి అన్నారు.


ఈ వార్తల పైన బద్రీనాథ్ సమీపంలోని ఊర్వశి ఆలయ అర్చకులు మండిపడుతున్నారు. బద్రీనాథ్ సమీపంలో తనకు గుడి కట్టారంటూ గొప్పలు చెప్పిన నటి ఊర్వశి రౌతేలపై అర్చకులు సీరియస్ అవుతున్నారు. బామ్ని సమీపంలో ఊర్వశి ఆలయం ఉన్నది నిజమే కానీ దానికి నటి ఊర్వశికి సంబంధం లేదని ఆర్చకులు చెప్పారు.


శ్రీ మహావిష్ణువు తోడ నుంచి ఉద్భవించిన సతి దేవి శరీర భాగం పడిన ప్రదేశంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందినట్లుగా ఊర్వశి ఆలయం అర్చకులు తెలియజేశారు. నటి ఊర్వశి అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమెపైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నటి ఊర్వశి చేసిన కామెంట్ల పైన అభిమానులు, నెటిజన్లు సైతం మండిపడ్డారు. ఆర్చకులు చేసిన ఈ కామెంట్ల పైన నటి ఊర్వశి ఏ విధంగా స్పందిస్తారో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: