
డ్రగ్స్ సరఫరా చేయడానికి కొంతమంది మధ్యవర్తులు ఉండేవారని ఆయన చెప్పుకొచ్చారు. అడిగితే సినిమా సెట్స్ కు సైతం తీసుకొచ్చి ఇచ్చేవారని షైన్ టామ్ చాకో చెప్పినట్టు భోగట్టా. షైన్ టామ్ ఛాకో ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. షైన్ టామ్ చాకో ఫోన్ ను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. తన డబ్బులను వేర్వేరు వ్యక్తులకు అప్పుగా ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు.
ఒక హోటల్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడినుంచి పారిపోయిన షైన్ టామ్ చాకోను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. షైన్ టామ్ చాకో ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మలయాళ నటి విన్సీ సోనీ చేసిన ఆరోపణల గురించి షైన్ టామ్ చాకో మాట్లాడుతూ తనపై ఆరోపణల్లో నిజం లేదని చెప్పినట్టు తెలుస్తోంది.
మరోవైపు డ్రగ్స్ విషయం గురించి కేరళ ఎక్సైజ్ శాఖ మంత్రి రియాక్ట్ అయ్యారు. డ్రగ్స్ వల్ల సమాజం, యువత భవిష్యత్తు నాశనం అయిపోతుందని ఆయన తెలిపారు. డ్రగ్స్ నిర్మూల కోసం శ్రమిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా వాటిని వినియోగిస్తున్నట్టు తేలితే అస్సలు వదిలిపెట్టబోమని ఆయన వెల్లడించారు. ఆయన వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వివాదల వల్ల షైన్ టామ్ చాకో కెరీర్ ప్రమాదంలో పడినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.