
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటి సంపాదించుకున్న అట్లీ ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ తో సినిమా ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా ఇప్పటివరకు ఫిలిం ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ తెరకెక్కించని కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్నాడు అంటూ కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది . అయితే ఈ సినిమా అప్ డేట్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా బయటకు రావడం లేదు . నిజానికి అట్లీ సినిమాకి కమిట్ అయితే ముందు నుంచే సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక హింట్ ఇస్తూనే వస్తారు.
కానీ అల్లు అర్జున్ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయాడు అట్లీ. ఈ సినిమా అప్డేట్ ఏది కూడా ఇవ్వడం లేదు. రాజమౌళి - మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా విషయంలోనూ ఇలానే చేశారు. పూజా కార్యక్రమాలకు కానీ మిగతా ఏ సందర్భంలో కానీ ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా చేశాడు. సేమ్ ఇప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు అట్లీ అని మరొక రాజమౌళి లా తయారవ్వాలి అని చూస్తున్నాడు అని జనాలు నాటి నాటిగా కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ అట్లీ తెలివితేటలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో..!