టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోని తన లుక్కుని సైతం బయట కనిపించకుండా చాలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా రావడం లేదు. రాజమౌళితో సినిమా చేస్తూ ఉండడంతో సినిమాలకు సంబంధించి లుక్స్ ని మరింత గుట్టుగానే ఉంచేలా చూస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు విదేశాలకు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమౌళి సినిమా కోసం తన లుక్కుని పూర్తిగా మార్చేశారు మహేష్ బాబు.


పూర్తి గడ్డం పొడువాటి జుట్టుతో ఎన్నోసార్లు మహేష్ బాబు కనిపించారు. మరొకసారి మరొక విభిన్నమైన లుక్కులో కనిపించారు. అయితే ఇన్ని రోజులు దూరం నుంచి మహేష్ లుక్ చూడడం మాత్రమే జరిగింది. కానీ తాజాగా మహేష్ బాబు లుక్ ఫస్ట్ టైం దగ్గర నుంచి వచ్చినట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలో మహేష్, నమ్రత కలిసి ఒకే చోట కూర్చొని ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.మహేష్ బాబు ఈ ఫోటోలో చాలా రిలాక్స్గా కనిపిస్తూ ఉన్నారు.


షార్ట్, టీ షర్టు వేసుకొని మహేష్ బాబు మరింత పొడువాటి జుట్టుతో గుబురు గడ్డంతో కనిపిస్తూ ఉన్నారు. ఆయన లుక్స్ చాలా రఫ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. అభిమానులు ఎన్ని రోజులు ఏం కావాలో అలాంటి లుక్ లోనే కనిపించబోతున్నట్లు ఈ ఫోటోలను చూస్తే మనకు కనిపిస్తోంది. అయితే మహేష్ ను ఇంత మాస్ లుక్ లో ఎప్పుడూ కూడా అభిమానులు చూడలేదు. మరి రాజమౌళి తీస్తున్న సినిమా అంటే ఎవరైనా సరే మారిపోవాల్సిందే అంటూ పలువురి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం అడ్వెంచర్ స్టైల్లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో SSMB -29 సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: