- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

మన టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి ... అలాగే అక్కినేని నాగార్జున మధ్య స్నేహం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కొందరు సీనియర్ హీరోల మధ్య కొంత గ్యాప్ ఉన్నా కూడా నాగార్జున - చిరంజీవి మాత్రం ఎంతో సఖ్యతతో ఎంతో స్నేహంతో మెలుగుతూ ఉంటారు. వీరిద్దరి మధ్య బంధం గత మూడు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా కొనసాగుతూ వస్తోంది. తాజాగా అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్య అలాగే హీరోయిన్ శోభిత నుంచి ఒక గుడ్ న్యూస్ అంటూ కొద్ది రోజులుగా ఒక వార్త వైరల్ గా మారింది. ఇద్దరు యువ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్టు టాక్ వినిపించింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అన్న వార్త తర్వాత కన్ఫర్మ్ అయింది. అక్కినేని ఇంటి నుంచి ఏమో కానీ మెగా ఇంటి నుంచి ఓ గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ లో ప్రచారం వినిపిస్తోంది.


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అలాగే హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొణిదెల త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్టు ఇప్పుడు టాక్‌ వినిపిస్తోంది. దీంతో మెగా కుటుంబం నుంచి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ అధికారిక ప్రకటనగా రావచ్చని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఇక కొద్ది రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ తనకు వారసుడు లేదా వారసరాలు జన్మించిన తర్వాత అయినా కెరీర్ పరంగా సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: