ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో మెగా హీరో వరుణ్ తేజ్ కి అసలు హిట్టే లేదు.  ఇంకా పక్కాగా చెప్పాలి అంటే ఆయన హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. చేతిలో సినిమాలు ఉన్న అవి ఏవి హిట్ అవుతాయి అన్న అసలు మెగా అభిమానులకి కూడా లేవు . ఇలాంటి మూమెంట్లోనే  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక న్యూస్ మెగా అభిమానులకి కొత్త ఆశలు పుట్టేలా చేస్తుంది. జిల్ ,రాధే శ్యామ్ లాంటి సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ రాధాకృష్ణతో వరుణ్ తేజ్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ టాక్ వినిపిస్తుంది.


రాధే శ్యామ్ తర్వాత రాధాకృష్ణ నుంచి మరో సినిమా రాలేదు.  గోపీచంద్ తో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపించింది . వార్తలు కూడా వినిపించాయి . కానీ గోపీచంద్ వేరే ప్రాజెక్టుతో బిజీ అయిపోయాడు.  ఇప్పుడు అదే కథతో వరుణ్ తేజ్ ని స్టార్ గా మార్చబోతున్నాడు రాధాకృష్ణ అంటూ ఫిలిం సర్కిల్స్ లో ఓ  న్యూస్ వైరల్ గా మారింది . రాధే శ్యామ్ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.  కానీ కొన్ని కొన్ని సీన్స్.. స్టోరీ జనాలను సపరేట్గా అట్రాక్ట్ చేసింది .



రాధాకృష్ణ లో మంచి టాలెంట్ ఉంది . కానీ సరైన విధంగా అది ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు అని చాలామంది జనాలు కూడా మాట్లాడుకున్నారు.  అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ తో మాత్రం ఒక స్పెషల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారట . ఈ ప్రాజెక్టుని ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ చేసేసింది మెగా ఫ్యామిలీ అంటూ కూడా న్యూస్ బయటకు వచ్చింది . ప్రస్తుతం "కొరియన్ కనకరాజు" సినిమా చూస్తున్నాడు వరుణ్ తేజ్ . ఈ సినిమా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. అయితే త్వరలోనే రాధాకృష్ణతో కమిట్ అయిన ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చేలా ప్రయత్నిస్తున్నారట వరుణ్ తేజ్ . అంతేకాదు త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతున్నారట . అయితే చాలామంది ఈ కాంబో ని ట్రోల్ చేస్తున్నారు . రాధాకృష్ణకి హిట్స్ లేవు..వరుణ్ తేజ్ కి హిట్స్ లేవు ..ఇద్దరూ కలిస్తే హిట్టు పడుతుందా..? లేకపోతే మళ్లీ ఫ్లాప్ ఏ పడుతుందా ..? అంటూ రకరకాలుగా మీమ్‌స్ తో వరుణ్ తేజ్ ని.. రాధాకృష్ణను ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: