
నటసింహం బాలకృష్ణ బిఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశారు ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో తాజాగా ఆయన తన కారుకు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు .. దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . తన కొత్త కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా బాలకృష్ణ ఆర్డీవో కార్యాలయంలో ఫోటోలు దిగి సంతకం చేశారు . ఇక రీసెంట్గా బాలకృష్ణ తన కొత్త కారు బీఎండబ్ల్యూ కారు కోసం రవాణా శాఖకు .. 7,75,000లు చెల్లించి టీజీ 09 ఎఫ్ 0001 అనే ఫ్యాన్సీ నెంబర్ ను వేలం ద్వారా సొంతం చేసుకున్నారు .. ఇలా బాలకృష్ణ రిజిస్ట్రేషన్ కార్యాలయాని కి వచ్చి ఆ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు ..
కాగా బాలకృష్ణ ఆర్డీవో కార్యాలయాని కి వస్తున్నార ని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్య లో అక్కడికి చేరుకున్నారు .. అలాగే ఆర్జీవో కార్యాలయం వద్ద అభిమానులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ 2లో నటిస్తున్నారు .. ఇప్పటికే షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది కుంభమేళాల తో పాటు హిమాలయాల్లో కూడా ఇప్పటికే పలు కీలక సన్నివేశాలు తెరకెక్కించగా .. హైదరాబాదులో కూడా ఒక షెడ్యూల్ పూర్తి చేశారు .. ఈ నెలలో బాలకృష్ణ తో పాటు కీలక నుటలతో జాజియా వెళ్లడాని కి చిత్ర యూనిట్ రెడీ అవుతుంది .. దాదాపు నెలపాటు మే అంత జార్జియాలో షూటింగ్ ప్లాన్ చేశారు చిత్ర యూనిట్ .. ఈ ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబర్ 25 న మూవీ ని థియేటర్లలోకి రానుంది . అలాగే తాజా గా బాలకృష్ణ భారత రాష్ట్రపతి ద్వారా పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు ..