సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే సందర్భాలు చాలా రేర్ గా వస్తూ ఉంటాయి.  మనం గమనించినట్లయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఎప్పుడు కూడా ఒకే కంటెంట్ ఆఫ్ జోనర్లో ముందుకు వెళుతూ ఉంటారు . చాలా రేర్ హీరోస్ మాత్రమే తమ లిమిట్స్ క్రాస్ చేసి ఫ్యాన్స్ ఒపీనియన్ ని కూడా పట్టించుకోకుండా సినిమాలను ఓకే చేస్తూ ఉంటారు.  ఆ లిస్టులో మనం చెప్పుకోదగ్గ హీరోస్ చాలా తక్కువ మంది ఉంటారు.  మరి ముఖ్యంగా మహేష్ బాబు లాంటి ఒక స్టార్ హీరో తన లిమిట్స్ క్రాస్ చేసి సినిమాలో బిప్ పదాలు ఉండే విధంగా డైలాగ్స్ చెప్పాడు అంటే ఆయన తన లిమిట్స్ ఎంతలా క్రాస్ చేశాడు అనేది అర్థం చేసుకోవచ్చు .


అయితే మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించినా ఎన్నో సినిమాలు హిట్ అయినా.. అందరికీ చాలా చాలా ప్రత్యేకంగా అదేవిధంగా ఇబ్బందికరంగా అనిపించిన సినిమా బిజినెస్ మ్యాన్.  టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్  దర్శకత్వంలో తెరకెక్కిన బిజినెస్ మ్యాన్ సినిమా మహేష్ అభిమానులకు అదే విధంగా కామన్ పీపుల్స్ కు ఓ రేంజ్ లో మెంటల్ ఎక్కించేసింది. ఈ సినిమాల్లో మహేష్ బాబు మాట్లాడిన బూతు పదాలు ఇప్పటివరకు ఆయన మరి ఏ సినిమాలో కూడా మాట్లాడలేదు . అంతలా హద్దులు మీరి పోయాడు .



అయితే బిజినెస్ మ్యాన్ సినిమా మహేష్ బాబుకు ఎలాంటి కామెంట్స్ తెచ్చి పెట్టిందో..  ఇప్పుడు అలాంటి కామెంట్స్ నాని  హిట్ 3 సినిమా చూసిన జనాలు చేస్తున్నారు.  రీసెంట్ గానే నాని నటించిన హిట్ త్రీ సినిమా రిలీజ్ అయ్యింది . ఈ సినిమా థియేటర్స్ లో జనాలు చూస్తుంటే ఒక్కొక్కరు అరుపులు కేకలతో హడలెత్తిస్తున్నారు.  అది వైలెన్స్ కాదు వైలెన్స్ కి అమ్మ మొగుడే .. అసలు నానిని అలాంటి క్యారెక్టర్ లో చూస్తామని ఎప్పటికీ ఊహించలేకపోయారు ఫ్యాన్స్.  అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లో నాని నటించలేదు జీవించేశాడు అంటున్నారు జనాలు.  కొంతమంది నాని పెర్ఫార్మన్స్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు వైలెంట్  కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి బిజినెస్ మాన్ సినిమా మహేష్ బాబుకి హిట్ 3 సినిమా నానికి మంచి బ్రేక్ ఇచ్చింది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: