- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

బాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే టైమ్ ఏమాత్రం బాగాలేదని చెప్పాలి. పూజ న‌టించిన సినిమా హిట్ కొట్టి ఏళ్ల‌కు ఏళ్లు అయిపోతోంది. ఆమె తెలుగులో వ‌రుస‌గా క్రేజీ కాంబినేష‌న్ ల‌లో సినిమాలు చేసిన‌ప్పుడే కాస్త హిట్లు వ‌చ్చాయి. ఆమె అటు త‌మిళం తో పాటు అటు హిందీలో చేసిన సినిమాలు వ‌రుస పెట్టి ప్లాపులు అయ్యాయి. అప్పుడే ఆమె ఐరెన్ లెగ్ అన్న ముద్ర ప‌డిపోయింది. అస‌లు భాషతో సంబంధం లేకుండా ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోతూ వస్తుంది. తాజాగా స్టార్ హీరో సూర్య సరసన రెట్రో సినిమాలో నటించింది ఈ అమ్మ‌డు. ఈ సినిమా లో పూజ హీరోయిన్ అన‌గానే సినిమా పై చాలా మందికి న‌మ్మ‌కాలు లేవు. ఆమె ఐరెన్ లెగ్ సెంటిమెంట్ మ‌రోసారి ఈ సినిమాతో ఫ్రూవ్ అవుతుంద‌నే ఎక్కువ మంది అనుకున్నారు. చివ‌ర‌కు అదే నిజం అయ్యింది.


సినిమా మే 1న వరల్డ్‌వైడ్‌గా మంచి బజ్‌తో రిలీజ్ అయ్యి నిరాశ పూరిత‌మైన టాక్ తెచ్చుకుంది. ఈ సిని మాలో పూజ రోల్ కు మంచి మార్కులు ప‌డినా సినిమా ఆక‌ట్టుకోలేద‌నే ఎక్కువ మంది చెపుతున్నారు. రివ్యూ లు కూడా స‌రిగా రాలేదు. దీంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇత‌ర బిగ్ సినిమాలు పోటీ ఉండ‌డం.. ఇటు తెలుగులో హిట్ 3 ఉండ‌డంతో రెట్రో సినిమా బాగా డౌన్ అయిపోతోంది. ఇక పూజా నటించిన లాస్ట్ 7 సినిమా లు వరుసగా ఫ్లాప్‌లుగా నిలవడంతో ఆమె అభిమానులు బాగా డిజ‌ప్పాయింట్ అయిపోతున్నారు. ఆమె యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మొదలుకొని.. బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా, రెట్రో ఇలా వరుసగా చిత్రాలు ఫెయిల్ అవుతుండటంతో పూజా కెరీర్ డైలమాలో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: